పొగతో ప్రమాదమే...
ఇటీవల సోషల్ మీడియాలో విచిత్ర ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా దీపావళి సందర్భంగా పర్యావరణానికి హాని కలిగించే పద్ధతి వద్దంటూ పలువురు చేస్తున్న సూచనను కొందరు తప్పుబడుతున్నారు. ఒక్క రోజయినా సందడి వద్దంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. సరదా కోసం మన భవిష్యత్తుకు ముప్పు కలిగించే పరిస్థితి తీసుకొస్తే మరింత నష్టం కదా అన్నది మరికొందరి అభిప్రాయం.
వాటిలో లాభనష్టాలు అలా ఉంచితే తాజాగా చైనా చుట్టూ గతంలో బియ్యం, గుడ్లు సహా వివిధ రూపాల్లో అబద్ధాలు ప్రచారం చేసి అభాసుపాలయిన సెక్షన్ తాజాగా మరో వింత వాదన తెస్తోంది. చైనా నుంచి దిగుమతి అయిన దీపావళి బాణసంచాలో ప్రమాదకర విషవాయువులున్నాయని, వాటిని పీల్చితే మనకు ప్రమాదం అని, చైనా కుట్రపూరితంగా మన దేశంలోకి పంపించిందని ప్రచారం చేస్తున్నారు.
కాసేపు నిజమే అనుకుందాం...అలాంటి అతి ప్రమాదకర దీపావళి సామాగ్రి మనదేశంలోకి రావడానికి కారణమయిన ప్రభుత్వాన్ని ఏం చేయాలి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వస్తువులను దిగుమతి చేసుకున్నందుకు వారిని ఏమనాలి. అడ్డగోలుగా విదేశీ వస్తువులు మనదేశంలోకి వస్తున్నా అడ్డుకోకుండా బజారులో జనాలను బేజారెత్తించే పనులు చేయడం ఎందుకు..ఇవీ జనాల ప్రశ్నలు.
అంతేకాదు మనదేశ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడం మనకు మంచిది. మనం చేయాల్సిందే. కానీ మనదేశానికి పోటీగా కారుచౌకగా చైనా వస్తువులను దిగుమతి చేసుకుంటూ మన ఉత్పత్తులు కొనాలడం రాజకీయంగా మేలుచేస్తుందే తప్ప నిజమైన ఉత్పత్తిదారుడికి గానీ, కొనుగోలుదారుడికి గానీ ప్రయోజనం కలిగించదు. అంతేగాకుండా చివరకు దీపావళి సామాగ్రి మీద జీఎస్టీ పెంచేసి మరింత దారుణంగా ధరలు పెరగడానికి కారణమవుతున్న విషయాన్ని జనం గ్రహించకుండానే ఇలాంటి ప్రచారం సాగిస్తున్నారా అన్న సందేహం కూడా వినిపిస్తోంది.
ఇలాంటి కీలకాంశాలను పక్కన పెట్టి చైనా చుట్టూ అబద్ధాలను చుట్టూ జనం మీద వాట్సాప్, ఎఫ్ బీ ద్వారా వదిలే బ్యాచ్ తయారయ్యింది. వారి విసిరే అబద్ధాల పొగను పీల్చారో..పెద్ద ప్రమాదం తప్పదు. దీపావళి కాలుష్యం కన్నా ఈ అబద్ధాల ముప్పు అత్యంత చేటు చేస్తుంది. కాబట్టి కహానీలను నమ్మవద్దని సోషల్ మీడియా ఫర్ సొసైటీ (SMS) కోరుతోంది.
Friday, 13 October 2017
పొగతో ప్రమాదమే...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment