కాకినాడలో నేతల ప్రచారంలో పందులు,కుక్కలను ఎవరు నివారిస్తారో వారికి ఓట్లు వేస్తామనడం మంచి పరిణామం. ఆంధ్రదేశం మెత్తంగా కుక్కలు తిరగడం మనుషులపై దాడి చేయడం చూసాం.ఇప్పుడు పందులు కూడా దాడి చేస్తూ భయ బ్రాంతులకు గురి చేస్తున్న క్రమంలో ప్రజలు బాగానే డిమాండ్ చేశారు. బాబు స్వచ్చాంధ్రప్రదేశ్ అని ఊదర గొట్టి పందుల నివారణలో విఫలమయ్యారు. ఆర్థిక మంత్రిగా పదవి వెలగబెడుతున్న మంత్రి ఇలఖలోనే పందులు స్వరవిహారం చేస్తూన్నాయి.పందులు పెంపకం చేసేవారు ప్రత్యేకంగా ఫార్మ్సా ఏర్పాటు చేసుకుని పెంపకం చేయాలి. అంతేకాని ఊరి మీద వదిలేయ కూడదు.ఆ విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూన్నాను.
Saturday, 26 August 2017
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment