పొగతో ప్రమాదమే...
ఇటీవల సోషల్ మీడియాలో విచిత్ర ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా దీపావళి సందర్భంగా పర్యావరణానికి హాని కలిగించే పద్ధతి వద్దంటూ పలువురు చేస్తున్న సూచనను కొందరు తప్పుబడుతున్నారు. ఒక్క రోజయినా సందడి వద్దంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. సరదా కోసం మన భవిష్యత్తుకు ముప్పు కలిగించే పరిస్థితి తీసుకొస్తే మరింత నష్టం కదా అన్నది మరికొందరి అభిప్రాయం.
వాటిలో లాభనష్టాలు అలా ఉంచితే తాజాగా చైనా చుట్టూ గతంలో బియ్యం, గుడ్లు సహా వివిధ రూపాల్లో అబద్ధాలు ప్రచారం చేసి అభాసుపాలయిన సెక్షన్ తాజాగా మరో వింత వాదన తెస్తోంది. చైనా నుంచి దిగుమతి అయిన దీపావళి బాణసంచాలో ప్రమాదకర విషవాయువులున్నాయని, వాటిని పీల్చితే మనకు ప్రమాదం అని, చైనా కుట్రపూరితంగా మన దేశంలోకి పంపించిందని ప్రచారం చేస్తున్నారు.
కాసేపు నిజమే అనుకుందాం...అలాంటి అతి ప్రమాదకర దీపావళి సామాగ్రి మనదేశంలోకి రావడానికి కారణమయిన ప్రభుత్వాన్ని ఏం చేయాలి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వస్తువులను దిగుమతి చేసుకున్నందుకు వారిని ఏమనాలి. అడ్డగోలుగా విదేశీ వస్తువులు మనదేశంలోకి వస్తున్నా అడ్డుకోకుండా బజారులో జనాలను బేజారెత్తించే పనులు చేయడం ఎందుకు..ఇవీ జనాల ప్రశ్నలు.
అంతేకాదు మనదేశ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడం మనకు మంచిది. మనం చేయాల్సిందే. కానీ మనదేశానికి పోటీగా కారుచౌకగా చైనా వస్తువులను దిగుమతి చేసుకుంటూ మన ఉత్పత్తులు కొనాలడం రాజకీయంగా మేలుచేస్తుందే తప్ప నిజమైన ఉత్పత్తిదారుడికి గానీ, కొనుగోలుదారుడికి గానీ ప్రయోజనం కలిగించదు. అంతేగాకుండా చివరకు దీపావళి సామాగ్రి మీద జీఎస్టీ పెంచేసి మరింత దారుణంగా ధరలు పెరగడానికి కారణమవుతున్న విషయాన్ని జనం గ్రహించకుండానే ఇలాంటి ప్రచారం సాగిస్తున్నారా అన్న సందేహం కూడా వినిపిస్తోంది.
ఇలాంటి కీలకాంశాలను పక్కన పెట్టి చైనా చుట్టూ అబద్ధాలను చుట్టూ జనం మీద వాట్సాప్, ఎఫ్ బీ ద్వారా వదిలే బ్యాచ్ తయారయ్యింది. వారి విసిరే అబద్ధాల పొగను పీల్చారో..పెద్ద ప్రమాదం తప్పదు. దీపావళి కాలుష్యం కన్నా ఈ అబద్ధాల ముప్పు అత్యంత చేటు చేస్తుంది. కాబట్టి కహానీలను నమ్మవద్దని సోషల్ మీడియా ఫర్ సొసైటీ (SMS) కోరుతోంది.
Friday, 13 October 2017
Thursday, 31 August 2017
#నంద్యాల_ఎన్నికలు_వధ్యశిలపై_ప్రజాస్వామ్యం#
నంద్యాల ఎన్నికల నిర్వహణ తీరు ప్రజాస్వామ్య వాదులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ, ప్రతిపక్షాలు ప్రధానంగా అధికార పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థపై క్రూరమైన దాడి చేసింది. బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ ఇతర రాష్ట్రాలలో గానీ ఇంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో ఇంత భారీ ఎత్తున ధన ప్రవాహం, అధికార దుర్వినియోగం జరిగి వుండదు.
ఈ పాటికే ఎన్నికలు ఖరీదైన నేపథ్యంలో కోట్లు కుమ్మరిస్తే గానీ గెలుపొందలేని ప్రమాదకర ధోరణిని నంద్యాల ఉప ఎన్నికలు మరింత ముమ్మరం చేశాయి. ఈ అంశంలో వైకాపా కూడా తక్కువ తినలేదు. రెండూ ఒక ఆకులో చింపుళ్ళే. గతంలో విపక్షనేత జగన్ తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా దక్కనీయకుండా చేసిన అనుభవముంది. ప్రస్తుతం అధికార దండం చేత పట్టుకున్న ముఖ్యమంత్రి పైచేయి సంపాదించి విపక్షాన్ని చిత్తు చేయడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలను మంట గలిపారు. సాధారణంగా ఉప ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా వుంటాయి. 1999 నుంచి 2004 వరకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం హయాంలో ప్రతిపక్షాలు గెలుపొందలేదు. అయితే ఈ ఎన్నికల సందర్భంగా అనుసరించిన పెడ ధోరణుల గురించే వామపక్ష ప్రజాతంత్ర ప్రజాస్వామ్య వాదులు ఆలోచించవలసి వుంది. ఈ సందర్భంలో ఒక అంశం పేర్కొనక తప్పడం లేదు. హాస్యకళా చక్రవర్తి, ప్రగతిశీలవాది, చార్లీ చాప్లిన్ నటించిన హాస్య సన్నివేశమొకటి సమాచార మాధ్యమాలలో హల్‌చల్ చేస్తోంది. సర్కస్‌లో బఫూన్‌గా పని చేసే చాప్లిన్ జంతుజాలముండే ఆవరణలోకి రాగానే గుర్రమొకటి పొడిచేందుకు తరుముతుంటుంది. దాని నుంచి తప్పించుకునేందుకు చాప్లిన్ పరిగెత్తుకుంటూ ఒక ఇనుప బోను లోనికి వెళ్ళి తలుపు వేసుకొంటాడు. తీరా చూస్తే బోనులో సింహమొకటి నిద్ర పోతుంటుంది. చివరికి చాప్లిన్ బోను నుంచి బయటపడి తప్పించుకుంటాడు. ఇదంతా ఎందుకంటే ప్రస్తుతం నంద్యాల ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజల అవస్థ చాప్లిన్ ఎదుర్కొన్న అనుభవాన్ని తలపిస్తోంది. అందుకే రాష్ట్రంలో వామపక్ష ప్రజాతంత్ర శక్తులు తెలుగుదేశం పార్టీ ఓటమి చెందాలని అభిలషించాయి.
అదే సమయంలో 2019 ఎన్నికలకు నంద్యాల ఎన్నికల ఫలితాలు గీటురాయిగా వుంటాయా? రాజకీయ సమీకరణలు ఎలా వుంటాయి? సంప్రదాయంగా ఆయా పార్టీలకున్న ఓటు బ్యాంక్ అలాగే వుంటుందా? మార్పులేవైనా జరుగుతాయా? నూతన సమీకరణలు ఎలా వుంటాయి? తెలుగుదేశం, వైకాపా రెండూ బిజెపితో చెలిమి చేస్తున్నందున దళితులు, మైనార్టీల వైఖరి ఎలా వుంటుంది? ఇత్యాది అంశాలకు నంద్యాల ఎన్నికల ఫలితాలతో జవాబు లభిస్తుందని విశ్లేషకులు ఆశించారు. అయితే రాష్ట్రంలోని అధికార పార్టీ తన ధన, అధికార మదంతో మొత్తంగా ఈ రాజకీయ సమీకరణలను తుడిచి పెట్టింది. అంతేకాక పలు రకాల ప్రలోభాలు తెరమీదకు వచ్చాయి. కులాలు మతాల వారీగా పదవుల పంపకాలు జరిగాయి. కుల, మత సమావేశాలకు ఆత్మీయతనే ముసుగు తొడిగారు. ఎన్నికల సంఘం కూడా అచేతనంగా వుండిపోయింది. ఒకరు వెయ్యి రూపాయలిస్తే మరొకరు మూడు వేలు ఇచ్చారు. చీరలు, బొట్టుబిళ్ళలు, ముక్కు పుడకల పంపకానికి అంతే లేదు. 20 మంది మంత్రులు 50 మంది ఎమ్మెల్యేలు అక్కడే మకాం పెట్టారు. ఇందుకు దీటుగా వైకాపా కూడా తన బలగాన్ని నంద్యాలలో దింపింది. ఎన్నికల ప్రకటన వెలువడక ముందే రూ.1500 కోట్లతో అభివృద్ధి పథకాలు ప్రకటించారు. 17 వేల గృహాలు మంజూరు చేశారు. అదనంగా 10 వేల ఫించన్లు ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేశారు. వలసల బతుకుతో, దుర్భిక్షంతో మిగిలిన రాయలసీమ మట్టిగొట్టుకు పోయినా సరే తన గెలుపుకు తన విధానాలకు నంద్యాల ఎన్నికలు నిదర్శనం కావాలని ముఖ్యమంత్రి పన్నిన పన్నాగంలో ప్రజలు చిక్కుకొని విలవిలలాడారు. ఇలా ఆయన మాయలోపడి మోసపోయారు. నంద్యాలలో టిడిపి గెలుపొందకపోతే అభివృద్ధి పథకాలు ఆగిపోతాయని... కొత్తగా ప్రకటించిన గృహాలు, ఫించన్లు నిలిచిపోతాయని పెద్ద ఎత్తున ఊదరగొట్టారు. ఈ భయాందోళనలు ఎబోలా వైరస్ లాగా వ్యాపించడంతో ప్రభుత్వ వ్యతిరేకత పెనుభూతంగా వున్నా... మూడున్నరేళ్ళ కాలంలో ముఖ్యమంత్రి కన్నెత్తి చూడకున్నా... ప్రలోభాలలో, ధన ప్రవాహంలో ఇవన్నీ కొట్టుకుపోయాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇది అసహజమేమీ కాదు. అయినా ప్రజాస్వామ్య విలువలు ఎంత కారుచీకట్లోనైనా మిణుగురు పురుగుల్లాగా మెరుస్తూనే వుంటాయి.
ఇంతకీ తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఏమవుతుంది? వైకాపా గెలిస్తే కలిగే లాభమేమిటి? ఇవి కీలక ప్రశ్నలేమీ కావు. వైకాపా గెలిచి వుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అపసవ్య ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు తాత్కాలికంగా బ్రేకు పడి వుండేది. ప్రస్తుతం ముఖ్యమంత్రికి పట్టపగ్గాలుండవు. ఈ అంశంలో తెలుగుదేశం నేతల్లోనే విస్తృత చర్చ సాగుతోంది. ఇక ఇంటర్వ్యూలు కూడా దొరకవేమోనని జోకులు వేసుకుంటున్నారట. తను ఇన్నాళ్ళు రాజధాని నిర్మాణం, ప్రాజెక్టులకు, పరిశ్రమలకు భూ సేకరణ సందర్భంగా అనుసరిస్తూ వచ్చిన ఏకపక్ష ప్రజా వ్యతిరేక విధానాలకు నంద్యాల ప్రజలు వేసిన ఆమోద ముద్రను రాష్ట్రం లోని ప్రజలందరికీ ఆపాదించి మరీ ఎదురు దాడికి దిగే ప్రమాదం పొంచి వుంది.
రాష్ట్రం ఈపాటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి వున్నా చట్టబద్దంగా కేంద్రం నుంచి రాజధాని నిర్మాణానికి రావాల్సిన నిధులు రాబట్టకపోగా మరింత అప్పులు చేసి భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలపై పెనుభారం మోపబోతున్నారు. ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపనలో భూ సేకరణ సందర్భంగా దళితులు చిన్న సన్నకారు రైతులకు మరింత అపకారం జరిగే అవకాశం వుంది. ప్రధానంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజలలో అసమానతలపై నెలకొన్న భావాన్ని ముఖ్యమంత్రి ఒక్క ముక్కలో కొట్టిపారేసే అవకాశం లేకపోలేదు. రాయలసీమ ప్రజలే తనకు తన విధానాలకు చట్టబద్ధమైన లైసెన్స్ ఇచ్చారని చెప్పినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. రాయలసీమలో నెలకొన్న దుర్భిక్షం, రైతుల ఆత్మహత్యలు, ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ కూడా నంద్యాల ఎన్నికలలో వంద కోట్ల ధన ప్రవాహంతో తుడిచి పెట్టుకుపోయాయి.
ప్రధాన మంత్రి మోడీ వద్ద మెప్పులు పొందేందుకు మున్ముందు మతోన్మాద శక్తులను ప్రతిఘటించే వామపక్ష ప్రజాతంత్ర శక్తుల గొంతు నొక్కే అవకాశముంది. ఈ మూడున్నరేళ్ల కాలంలో జరిగిన అప్రజాస్వామిక పోలీసు జులుం చాలా తక్కువే. ముందున్నది ముసళ్ళ పండుగ. దళితులు, పీడిత వర్గాల పక్షాన నిలబడి పోరాడే వారిపై తీవ్రమైన దమనకాండ ప్రయోగించేందుకు నంద్యాల ఎన్నికల గెలుపును ఒక సర్టిఫికెట్‌గా ముఖ్యమంత్రి చూపవచ్చు. కొసమెరుపు ఏమంటే రాష్ట్రంలో ఒక మారుమూల నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందితే ప్రధాన మంత్రి ట్వీట్ చేస్తూ అభినందనలు చెప్పారంటేనే భవిష్యత్తులో టిడిపి-బిజెపి అనుబంధం ఎంత ప్రగాఢంగా వుండబోతోందో తెలుస్తోంది. వైకాపా నేత జగన్ ఇప్పటికైనా గుర్తిస్తే ఎంతో క్షేమం. అంతేకాదు! నంద్యాల ఎన్నికల తీరుపై కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు వాస్తవ రిపోర్టులు ఇచ్చి వుంటాయి. ప్రజాస్వామ్యం ఎలా పరిహసింపబడిందో చెప్పి వుంటాయి. అయినా ప్రధానమంత్రి ట్వీట్ చేశారంటే భవిష్యత్తులో దేశ వ్యాప్తంగా బిజెపి, దాని మిత్రులు అనుసరించబోయే ప్రమాదకర ధోరణికి నిదర్శనంగా వుంది.
-నరిసెట్టి ఇన్నయ్య.
సుప్రసిద్ధ బ్రిటిష్ మెడికల్ మ్యాగజైన్ "లాన్సెట్" ఎడిటర్ రాబిన్ ఫాక్స్ స్వయంగా 1991లోనే కలకత్తాలో ఈ దృశ్యాలు చూచారు. అలాగే విశ్వవిఖ్యాత జర్నలిస్ట్ క్రిస్టోఫర్ హిచెన్స్ కూడా స్వయంగా మదర్ తెరిసాను కలసి ఇలాంటి సంఘటనలు గ్రహించారు.<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script>
<ins class="adsbygoogle"
style="display:block"
data-ad-format="fluid"
data-ad-layout="image-middle"
data-ad-layout-key="-gp-13-4l+6+pt"
data-ad-client="ca-pub-4176278781781681"
data-ad-slot="9787094375"></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>
1976లో హైదరాబాద్ లో నేను మదర్ తెరిసాను ఇంటరర్వూ చేసాను.
ఐర్లాండ్ లో కేథలిక్కులు అత్యధికంగా ఉన్నచోట గర్భస్రావం విడాకుల విషయం పార్లమెంటులో చర్చికి రాగా, మదర్ తెరిసా గూడా కల్పించుకుని తన మత ప్రకారం విడాకులు ససేమిరా వీలుకాదన్నది.
<ins class="adsbygoogle"
style="display:block"
data-ad-format="fluid"
data-ad-layout="image-middle"
data-ad-layout-key="-gp-13-4l+6+pt"
data-ad-client="ca-pub-4176278781781681"
data-ad-slot="9787094375"></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>
మదర్ తెరిసా(1910-1997) తల్లిదండ్రులు పెట్టిన పేరుకాదు. ఆమె పుట్టింది మాసడోనియా దేశంలోని స్కోపీజేలో. సోదరి, సోదరుడు ఉన్నారు. క్రైస్తవమత శాఖలో నన్స్ అయ్యే ఒక సాంప్రదాయం పాటించి,15వ యేట ఈమె ఐర్లాండ్ వెళ్ళింది. అక్కడినుండి ఇండియాలో కలకత్తా చేరుకున్నది. 1929లో కొన్నాళ్ళు టీచర్ గా చేసి, చివరకు నన్ గా కుదురుకున్నది. తొలిపేరు ఆగ్నస్ గోంషా బొజాక్సు.
<ins class="adsbygoogle"
style="display:block"
data-ad-format="fluid"
data-ad-layout="image-middle"
data-ad-layout-key="-gp-13-4l+6+pt"
data-ad-client="ca-pub-4176278781781681"
data-ad-slot="9787094375"></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>
<ins class="adsbygoogle"
style="display:block"
data-ad-format="fluid"
data-ad-layout="image-middle"
data-ad-layout-key="-gp-13-4l+6+pt"
data-ad-client="ca-pub-4176278781781681"
data-ad-slot="9787094375"></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>
సుప్రసిద్ధ జర్నలిస్ట్ క్రిస్టోఫర్ హిచిన్స్, తారిక్ అలీ ఇంగ్లాండ్ లో ఒక డాక్యుమెంటరీ తీసి (హెల్స్ ఏంజిల్) ఛానల్ 4లో మదర్ తెరిసా గుట్టురట్టు చేసారు. 'ది మిషనరీ పొజిషన్' శీర్షికన హిచిన్స్ ఒక పుస్తకం వెలువరించారు. సునంద దత్త రే కూడా నిశిత పరిశీలనా వ్యాసాలు రాసారు. అరూప్ ఛటర్జీ 'న్యూ స్టేట్స్ మెన్'లో 1997 సెప్టెంబర్ 26న తీవ్ర పరిశీలనా వ్యాసం రాసారు. ధీరుషా ఇండియాలో మతమార్పిడిలు చేసిన మదర్ తెరిసా గురించి రాసారు.
మదర్ తెరిసా వసూళ్ళ గురించి జర్మనీలో స్టెరన్ అనే పత్రిక విచారణ జరిపింది. నిధులు ఎంత,ఎక్కడ ఉన్నాయి? ఎలా ఖర్చు చేస్తున్నారని అడిగితే చెప్పలేదు. అంతా రహస్యం అన్నారు.
మదర్ తెరిసా చనిపోగానే, పోప్ జాన్ పాల్ కొత్త ఎత్తుగడకు నాంది పలికాడు. మతవ్యవస్థలో చనిపోయిన వ్యక్తిని సెయింట్ చెయ్యాలంటే రెండు అద్భుతాలు చూపాలి. కనీసం 5 సంవత్సరాలు వేచి ఉండాలి. మతవ్యాపారంలో పోప్ ఆరితేరిన వ్యక్తి కనుక. అంత జాప్యం లేకుండా మదర్ తెరిసాను సెయింట్ చేయడానికి పూనుకున్నాడు. 19 అక్టోబర్ 2003లో అందుకు తొలిప్రక్రియ ప్రకటించాడు.
<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script>
<ins class="adsbygoogle"
style="display:block"
data-ad-format="fluid"
data-ad-layout="image-middle"
data-ad-layout-key="-gp-13-4l+6+pt"
data-ad-client="ca-pub-4176278781781681"
data-ad-slot="9787094375"></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>
<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script>
<ins class="adsbygoogle"
style="display:block"
data-ad-format="fluid"
data-ad-layout="image-middle"
data-ad-layout-key="-gp-13-4l+6+pt"
data-ad-client="ca-pub-4176278781781681"
data-ad-slot="9787094375"></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>
Wednesday, 30 August 2017
*ఏమి దేశం రా బాబూ ?*
అప్పుడెప్పుడో *MGR చనిపోతే 6 మందికి గుండె ఆగిపోయిందిట.*
తర్వాత సెల్వీ (అనగా కుమారి ) జయలలిత *అవినీతి కేసులో జైలు కు వెళితే 11 మంది తమిళ తoబిలు ఆత్మాహుతి చేసుకున్నారు .*
ఆ రికార్డ్ బ్రేక్ చేస్తూ వైఎస్సార్ అకాల మరణం తో వందల కొద్దీ అభిమానుల గుండెలు ఆగాయి. *7 ఏళ్ళ పాటు సాగిన ఓదార్పు యాత్రల బట్టి మనం నమ్మక తప్పదు.*
తనకు గానీ తన వారికి గానీ ఏమీ మిగుల్చుకోకుoడా *దేశం అభ్యున్నతి కే అంకితం అయిన అబ్దుల్ కలాo చనిపోయినప్పుడు ఏ ఒక్క గుండె కూ హాని జరగలేదు .*
గోరక్పూర్ ఆసుపత్రి లో oxygen అందక *50 మంది అమాయక పసి ప్రాణాలు పోతే ప్రజల తిరుగుబాటు లేదు.*
కాగా వీడెవడో *బురిడీ బాబా గాడి పాపం పండి రేప్ కేస్ లో శిక్ష పడి జైలు కు వెళితే ఇంత తిరుగుబాటా?*
ఇంత హింసా? 4రాష్ట్రాలు అట్టుడికి పోవాలా ?
428 రైళ్ళు ఎక్కడివి అక్కడే ఆగిపోయి వేలాది ప్రయాణీకులు తిండీ తిప్పలు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడపాలా ?...
మాతృ దేశం గురించి గర్వ పడే క్షణాలు ఎన్నో ఉంటాయ్.
కానీ సిగ్గుపడే క్షణాలు కూడా కొన్ని ఉంటాయ్ ఆని అప్పుడప్పుడూ తెలిసి వస్తోంది .
ఏమి దేశం రా బాబూ ?
మనదేశంలో ....
రేపులు చేసినోడు *బాబా* అవుతాడు..
హత్యలు చేసినోడు *నాయకుడు* అవుతాడు..
అవినీతి చేసినోడు *అదికారి* అవుతాడు..
పంట పండించేవాడు *అడుక్కతింటాడు..*
కష్టపడి చదివిన వాడు బికారి అవుతాడు..
న్యాయంగా ఉండేవాళ్లంతా *నాశనం* అవుతారు..
*ఇదే మన 70 ఏళ్ల స్వతంత్ర్య దేశం..!!*
Sunday, 27 August 2017
రాజ్యం బలహీనంగా ఉన్నప్పుడూ, జనం సన్యాసుల మత్తు బిళ్ళలు మింగినప్పుడూ
బాబా గాళ్ళ ఆలోచనలే తుపాకీలవుతాయి. తూటాలై ప్రాణాలు తీస్తాయి. మానవ బాంబులై సమూహాల్లో తిరుగుతాయి. వెనకటికి ఇలాంటి కథలు చాలానే ఉండుంటాయి. ఎదో ఒక కథను చర్చించుకునే సందర్భం కానే కాదిది.
కొత్తగా ఏం జరిగిందని బాస్ ... ఎప్పుడూ జరిగేదే కదా
మన తాతలు చూసిందే కదా, మన నాన్నలు చూసిందే కదా, మనం చూస్తూ ఉన్నదే కదా !
అయితే ఇక్కడ
బయటకు కనపడని చాలా విషయాలు దాగున్నాయి. కొందరు బాబాలు రాజ్యానికి మద్దతు గానూ, మరి కొందరు రాజ్యానికి వ్యతిరేకంగానూ ఉంటారు. రాజ్యం మారినప్పుడు ... ప్రతి కొత్త రాజ్యం తరపునా ఎంతో కొంతమంది బాబాలు ఉంటూనే ఉంటారు. బాబాలకు రాజ్యం తోలు అవసరం. రాజ్యానికీ బాబాల తోలు అవసరం. ఎటొచ్చీ అర్ధం కాని తనంలో, అర్ధం చేసుకోని తనంలో తరాలుగా బానిసలుగా, భక్తులుగా ఓడిపోతుంది మామూలు జనమే.
డేరా వ్యవస్థ ఇప్పుడు పుట్టిందేం కాదు. స్వాతంత్రానికి పూర్వం నుంచే మన దేశంలో బలంగా పాతుకుపోయింది. దీనికి కులాలూ, మతాలూ, ఆధిపత్యం, అణగదొక్కపడటం లాంటి కారణాలున్నాయి. నీచానికి నీచంగా అణగదొక్కబడుతున్న కులాల తరపున .... కుల వ్యవస్థనూ, మతాల పోకడనూ అడ్డుకట్టి బలహీన వర్గాల వైపు నిలబడటానికి డోరా విధానం మొదలైంది. అయితే రానురాను అది కూడా మరో మతంలా తయారయింది.
ఎంతలా అంటే తాము నమ్మిన వ్యక్తి తప్పు చేశాడని తెలిసినా, సమర్దించుకునే అంత... 50 పైన రేప్ కేసులు ఉన్న వ్యక్తిని మంచోడూ అని చెప్పే అంత... అతని కోసం మూర్ఖంగా అతని సైన్యంలా మారి సమూహాల మీద పడి పాశవికంగా మనుషులను చంపే అంత...
అంతే కదా...
ఎప్పటికీ మనుషులే కదా... మాయలో పడేది. మోసపోయేది. రాజ్యానికో, బాబాలకో, అత్తెసరు సౌకర్యాలపేరుకో లొంగిపోయేది.
ఇప్పుడు డేరా వ్యవస్థకు పెద్దగా ఉన్న గుర్మీత్ బాబా ఇప్పటికే ఎన్నో దారుణాలు చేసున్నాడు. డేరా వ్యవస్థకు పెరిగిన క్రేజ్ ను వ్యాపారాల కోసం, వ్యక్తిగత సుఖాల కోసం వాడుకుని, కబ్జాలు చేసి, ఎంతో మందిని కొల్లగొట్టి... సామాన్యులు ఊహించలేనంత, కాలుక్యులేటర్లు లెక్కేయలేనంత ఆస్తులు సంపాదించాడు.
ఈ తతంగం అంతా నడుపుతూనే 5 కోట్ల మంది అభిమానులనూ, భక్తులనూ, సానుభూతిపరులనూ, లక్షల మంది ప్రయివేటు సైన్యాన్నీ సిద్ధం చేసుకున్నాడు.
ఇక్కడ బాబా ఆడిన మైండ్ గేమ్ వెనుక చాలా సింపుల్ ఫార్ములా ఉంది. రూపాయి ఖర్చుపెట్టి ఫండ్స్ రూపంలో వేలు రాబట్టుకున్నాడు. మళ్లీ వచ్చిన డబ్బులోని వెయ్యో వంతును జనాలకోసం, పిల్లల చదువుకోసం ఉపయోగించాడు. ఏదో ఒకరోజు తమకు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక సైన్యం కావాలి కాబట్టి భిక్ష వేస్తారు. కొందరిని సోమరిపోతులను చేస్తారు. వాళ్ళ జీవితాల్ని వీరి ప్రయాణానికి రహదారులను చేసుకుంటారు. సరిగ్గా ఈయన కూడా ఇదే చేశాడు.
అయితే ఇక్కడ ఇంకో మలుపు ఉంది. ఇప్పుడు బీజేపీ రాజ్యం ఆడుతున్న డ్రామా ఉంది.
ముందుగా అనుకున్నట్టు రాజ్యానికి బాబాల తోలు కావాలి. బాబాలకూ రాజ్యం తోలు కావాలి. కానీ ఇక్కడ డోరాబాబా బలమైన శక్తిగా ఎదిగి, రాజకీయాన్నీ పులుముకుని తానే రాజ్యం అయ్యే ఆలోచన దిశగా సాగుతున్నాడు.
మనం ఇక్కడొకటి గుర్తుంచుకోవాలి. గాడి తప్పిన రాజ్యమూ, బాబాలూ ఒకే అంత క్రూరమైన వాళ్ళు.
ఎప్పటి నుండో కేసులున్న ఈ బాబా విషయాలు ఇప్పుడు వెలుగులోకి రావడానికి చాలా రాజకీయ కారణాలూ ఉన్నాయి. బీజేపీ అడుగులకు మడుగులద్దే రామ్ దేవ్ బాబా లాంటి వాళ్ళ బలం పెంచే ఆలోచన కూడా ఉంది.
రాజ్యం తన ఉనికినీ, వ్యాపరాలనూ శక్తినీ కాపాడుకునే కుటిల యోచన ఉంది.
అలా అని శిక్ష వేయడం సరైంది కాదూ అనడం లేదు. కచ్చితంగా ఈ బాబా వెదవే, జనాల జీవితాలను సెవాలను చేసి వాటిపై బ్రతుకు ప్రయాణం చేసే ఉన్మాదే. ఇతనికి కచ్చితంగా శిక్ష పడాలి.
బాబా కొన్నేళ్లుగా ఆడిన డ్రామాలో తమకి తెలియకుండా తామే బాబా ప్రయివేటు సైన్యంగా మారిన జనాలకు అర్థం అయ్యేలా విషయాన్ని తెలియపరచాలి.
నిజానికి ఇది అనువైన సమయం
బాబాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం
ఈ ఒక్క బాబానే కాదు
రాజ్యం నుదిటిపై విభూదై, జనాల ఆశపై, అమాయకత్వంపై మతం మరకలై
నడుస్తూ దేశాన్ని యుగాల వెనక్కు నడిపిస్తోన్న బాబాల అందరి పైనా పోరాడాలి. రాజ్యం ముసుగులో తల దాచుకున్న ఒక్కోబాబానూ వెతికివెతికి శిక్షించాలి.
వీటన్నింటి కంటే ముందు మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. బాబాలకు మనం ఇచ్చే స్థానం మారాలి. అసలు బాబాలే లేని రోజు రావాలి. మన చుట్టూ ఉండేవారికి మనం ఆలోచన కలిపించాలి.
బాబాలూ అబద్దమనీ, మతాలు అక్కర్లేదనీ, కులాలు మనకడ్డమనీ... ఇదంతా మీకు వీలైనంత ఎక్కువ మందికి చెప్పండి ... Thank you
Saturday, 26 August 2017
కాకినాడలో నేతల ప్రచారంలో పందులు,కుక్కలను ఎవరు నివారిస్తారో వారికి ఓట్లు వేస్తామనడం మంచి పరిణామం. ఆంధ్రదేశం మెత్తంగా కుక్కలు తిరగడం మనుషులపై దాడి చేయడం చూసాం.ఇప్పుడు పందులు కూడా దాడి చేస్తూ భయ బ్రాంతులకు గురి చేస్తున్న క్రమంలో ప్రజలు బాగానే డిమాండ్ చేశారు. బాబు స్వచ్చాంధ్రప్రదేశ్ అని ఊదర గొట్టి పందుల నివారణలో విఫలమయ్యారు. ఆర్థిక మంత్రిగా పదవి వెలగబెడుతున్న మంత్రి ఇలఖలోనే పందులు స్వరవిహారం చేస్తూన్నాయి.పందులు పెంపకం చేసేవారు ప్రత్యేకంగా ఫార్మ్సా ఏర్పాటు చేసుకుని పెంపకం చేయాలి. అంతేకాని ఊరి మీద వదిలేయ కూడదు.ఆ విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూన్నాను.
*హర్యానాలో జరిగిన హత్యాకాండకు, విధ్వంసానికి ఎవర్ని నిందించాలి?*
*ఆధ్యాత్మిక గురువు ముసుగులో మూఢనమ్మకాలకు బానిసలైన అమాయక ప్రజలను వంచిస్తూ, అత్యాచారాలకు, హత్యలకు పాల్పడినట్లు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అఘాయిత్యం కేసులో నేరస్తుడని నిర్ధారించిన సిబిఐ ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేయడానికి సిద్ధమైన పూర్వరంగంలో నకిలీ ఆధ్యాత్మిక గురువు మద్ధతుదారులు హర్యానాలో విధ్వంసానికి తెగబడ్డారు. ఇప్పటికి 30 మంది ప్రాణాలు గాలిలో కలిపోయాయని ప్రసారమాధ్యమాల్లో చూస్తున్నాం.*
*విధ్వంసకాండ పంజాబ్, డిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లోను కొనసాగింది. అనేక వాహనాలు, రైలు బోగీలు, ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆస్తులు ఈ విధ్వంసకాండలో ధ్వంసమైనాయి. ఒక నేరస్తుడ్ని శిక్షించడానికి కోర్టు నిర్ధారణకు వస్తే నేరస్తుడి మద్ధతుదారులు పదుల వేల సంఖ్యలో వీధుల్లోకి వచ్చి విధ్వంసానికి బరితెగిస్తే నిరోధించే శక్తి ప్రభుత్వాలకు లేక పోవడాన్ని చూస్తే మన రాజకీయ వ్యవస్థ డొల్లతనం బయట పడుతున్నది.*
*అధికారమే పరమావధిగా భావిస్తున్న రాజకీయ పార్టీల నాయకులు ఈ తరహా నేరస్తుల మద్ధతు కోసం వెంపర్లాడుతూ, వారి చుట్టూ ప్రదక్షణలు చేస్తూ, కాళ్ళ మీద పడి దండాలు పెడుతున్న ఉదంతాలు కోకొల్లలు. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మద్ధతును 2007 & 2012 పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, 2014 హర్యానా శాసనసభ ఎన్నికల్లోను, అటుపై డిల్లీ మరియు బిహార్ శాసనసభల ఎన్నికల్లోను బిజెపి పొందాయి. ఆధ్యాత్మిక గురువులుగా ఛలామణి అవుతూ నేర సామ్రాజ్యాలను నిర్మించుకొన్న కరుడుకట్టిన నేరస్తులకు, రాజకీయ పార్టీలకు, నాయకుల మధ్య ఉన్న గాడాను బంధానికి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణ.*
*గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పేరును బట్టే వివిధ మతాల విశ్వాసాలకు బానిసలైన అమాయక ప్రజానీకాన్ని మోసం, వంచనతో నేరప్రపంచాన్ని నిర్మించుకొనే దుర్భుద్ధి కనబడుతున్నది. 'డేరా సాఛా సౌదా' ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆ పునాదులపైనే నిర్మించుకొన్నారు. ఆధ్యాత్మిక గురువుగానే కాకుండా కొన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించడం, సినిమాలు తీయడం, నటించడం, పాటలు పాడడం వగైరా కళళు ప్రదర్శించారు. బడుగు బలహీన తరగతులకు చెందిన అమాయక ప్రజలను తన అనుచరులుగా మార్చుకొన్నారు.*
*ఒక మహిళా 'డేరా సాధ్వి' 2002లో నాటి ప్రధాన మంత్రి అతల్ బిహార్ వాజ్ పేయికి ఒక లేఖ ద్వారా తనపై గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అఘాయిత్యం చేశాడని, తనలాగే పలువురు మహిళలను మానభంగం చేశాడని ఫిర్యాదు చేసినా స్పందన కరవైయ్యింది. కానీ, పంజాబ్-హర్యానా హైకోర్టు కేసును సూమోటోగా స్వీకరించి, కేసు నమోదు చేసి, విచారణ జరపమని సిబిఐని ఆదేశించడంతో 15 ఏళ్ళ విచారణానంతరం నేటికి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నేరస్తుడని ప్రత్యేక కోర్టు నిర్ధారణ చేసింది. డేరా నేరాలపై కథనాలు వ్రాస్తున్నాడని ఒక విలేకరిని, అలాగే డేరా కేంద్రం మేనేజరుగా పని చేసిన మరొక ఉద్యోగస్తుడను కూడా హత్య వేయించాడన్న కేసులు విచారణలో ఉన్నాయి.*
*ఇలాంటి నేరస్తుడి మద్ధతు తీసుకొన్న, అతడ్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రదక్షిణలు చేసిన, ప్రశంసించిన కాంగ్రెస్, బిజెపి పెద్ద మనుషులను ఏమనాలి? స్వఛ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వామి అయ్యాడని ప్రధాన మంత్రి మోడీ సహితం అత్యంత హేయమైన ఆరోపణలను ఎదుర్కొంటూ సిబిఐ కేసులో ముద్ధాయిగా ఉన్న వ్యక్తిని ప్రశంసించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి!*
*స్వార్థ రాజకీయాల పరాకాష్టకు హర్యానా విధ్వంసకాండే ప్రబల నిదర్శనం. గుర్మీత్ రామ్ రహీ సింగ్ పై హర్యానా ముఖ్యమంత్రికి ఉన్న స్వామి భక్తే ఈ దుష్పరిణామాలకు దారి తీసిందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ లాంటి వారిని ప్రోత్సహిస్తూ, పెంచి పోషిస్తున్న రాజకీయ నాయకులున్నంత కాలం మన సమాజం ఇలాంటి దుష్పరిణామాలను అనుభవించాల్సి ఉంటుంది.*
*దేశంలో నకిలీ ఆధ్యాత్మిక గురువులు, దొంగ బాబాలు, స్వాముల సంఖ్య గణనీయంగా పెరిగి పోయిన నేపథ్యంలో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ హత్యా నేరాలు, మానభంగాలు వగైరా నీచమైన చరిత్ర నుండి సమాజం సరియైన గుణపాఠాలు నేర్చుకోవాలి.*